#viral #news - Nandi Patrika

ప్రైమ్ హాస్పిటల్ లో రిహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభం
*ప్రైమ్ హాస్పిటల్ లో రిహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభం*
*👉. నంద్యాలలో ప్రధమంగా ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ (పునరావాస)కేంద్రం*
*👉. ఏర్పాటుచేసిన డాక్టర్ నాగరాజా రెడ్డి, డాక్టర్ భారతి*
*👉. ప్రారంభించిన డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదన రావు*
*👉. చికిత్సల తరువాత పూర్తిస్థాయిలో సాధారణ జీవనానికి ఈ కేంద్రం ఒక వరం: డాక్టర్ రవి కృష్ణ*
నంద్యాల సిటీ బ్యూరో నవంబర్ 11 ( నంది పత్రిక )
నంద్యాలలో సలీం నగర్ ప్రాంతంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలో ఉన్న ప్రైమ్ హాస్పిటల్ లో ప్రముఖ అత్యవసర చికిత్స నిపుణులు డాక్టర్ డి.న్.రాజారెడ్డి, ప్రముఖ న్యూరాలజీ నిపుణురాలు డాక్టర్ భారతీ రెడ్డి ఏర్పాటుచేసిన పూర్తిస్థాయి రిహాబిలిటేషన్ సెంటర్ ( చికిత్స తర్వాత పునరావాస కేంద్రం) మంగళవారం ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ డి.న్.రాజారెడ్డి,ప్రముఖ న్యూరాలజీ నిపుణురాలు డాక్టర్ భారతీ రెడ్డి మాట్లాడుతూ పక్షవాతం,మూత్రపిండ, గుండె,ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి,ప్రమాదాలలో ఎముక విరిగిన వారికి,వృద్ధులు,పిల్లలలో నరాల సమస్యలు ఉన్న వారు,తిరిగి సాధారణ జీవనాన్ని గడపడానికి ఈ కేంద్రం ఉపకరిస్తుందన్నారు. రోగులకు పూర్తిస్థాయిలో రిహాబిలిటేషన్ ( పునరావాస) కోసం ఈ కేంద్రంలో ఖరీదైన అత్యంత ఆధునిక పరికరాలు నగరాలకు దీటుగా నంద్యాలలో ఏర్పాటు చేశామన్నారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఈ కేంద్రంలో చికిత్స తర్వాత స్వతంత్ర జీవనశైలి సాధ్యం అవుతుందని,మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని,జీవిత నాణ్యత పెరుగుతుందని అన్నారు. ఈ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ
పునరావాసం అంటే రోగి తిరిగి తన సాధారణ జీవితానికి చేరుకునే మార్గమని,వ్యాధి, గాయం లేదా శస్త్రచికిత్స తర్వాత శరీర పనితీరును తిరిగి సాధించడానికి,రోజువారీ కార్యకలాపాలను స్వతంత్రంగా చేయడానికి,ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి,తిరిగి ఆసుపత్రిలో చేరే అవకాశాన్ని తగ్గించడానికి,కుటుంబం మరియు సమాజంలో రోగి స్థానం పునరుద్ధరించడానికి దోహదపడుతుందన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పట్టణ వైద్యులు రాకేష్ రెడ్డి,విజయ భాస్కర్ రెడ్డి,అనిల్ కుమార్,శ్రీనివాసరావు,సోమశేఖర్ రెడ్డి,నెట్ల మహేశ్వరరెడ్డి,రవికాంత్ రెడ్డి, నర్మద,కల్పన,మాధవి, నెట్ల శిల్పా తదితరులు పాల్గొన్నారు.

ఉసిరికాయ మీద కార్తీక శోభ
-కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రతిభ

నంద్యాల బ్యూరో. నవంబరు 02 . (పల్లె వెలుగు ):నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక సోమవారం సందర్బంగా ఓకే ఉసిరికాయ చుట్టూ మూడు ప్రధానమైన చిత్రాలను మైక్రో బ్రష్ ద్వారా అక్రాలిక్ కలర్స్ తో రెండు గంటల సమయంలో వేశారు. ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ఉసిరికి గొప్ప ప్రాధాన్యత వుంది. ఉసిరి చెట్టును సాక్షాత్తు శివుని స్వరూపమని చెబుతారు. అన్ని మాసాల కన్నా ఎంతో పవిత్ర మాసం కార్తీక మాసం.ఈ మాసంలో కార్తీక సోమవారాలకు, కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉందని భావిస్తారు. ఈ మాసంలో ఉసిరి చెట్టుకు ఉసిరి కాయలతో దీపాలు వెలిగించి భక్తితో పూజలు చేస్తారు. ఉసిరి చెట్టును పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని, నవగ్రహ దోషాలు తొలగి పోతాయని, అనారోగ్య సమస్యలు దరి చేరవని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఎంతో విశిష్టత వున్నా ఉసిరికాయ మీద సూక్ష్మ చిత్రాలు వేసాను. నేను వేసిన ఈ చిత్రంలో పరమశివుడు అర్ధనారీశ్వరుని రూపంలో చిరునవ్వుతో భక్తులకు దర్శనమిచ్చి దీవిస్తున్నట్లు, ఉసిరి చెట్టు కింద ఉసిరి కాయలతో దీపాలు వెలిగించి భక్తులు పూజిస్తునట్లు, శివలింగం, శివాలయం, ప్రకృతి దృశ్యాలు, స్త్రీలు కార్తీక దీపాలు నదిలో వదలి భక్తితో మొక్కుతున్నట్లు, భక్తులు పుణ్య నదిలో స్నానాలు చేస్తున్నట్లు ఇలా కార్తీకశోభను ఓకే చిన్న ఉసిరికాయ మీద వేసాను . భక్తులందరికి కార్తీకమాసం శుభాకాంక్షలు. అందరికి ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.

ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం
-డాక్టర్. ఎ అరుణ కుమారి
ఎంబీబీఎస్ డి జి ఓ ఎఫ్ఏజీఈ
ఇన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గోల్డ్ మెడల్
నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నంద్యాల

నంద్యాల ప్రతినిధి. అక్టోబర్ 19 . (నంది పత్రిక ):ఎండోక్రిన్ డిస్రప్టోరు అంటే శరీరంలోని హార్మోన్ల పనితీరును ప్రభావితం చేసే సహజమైన మానవ నిర్మిత రసాయనాలు.ఇవి హార్మోన్లను అనుకరిస్తాయి లేదా నిరోధిస్తాయి లేదా అంతరాయం కలగజేస్తాయి .ఇవి ఈస్ట్రోజన్ ఆండ్రోజన్ థైరాయిడ్ హార్మోన్లను సాధారణంగా అనుకరిస్తాయి.ప్లాస్టిక్స్ సౌందర్య సాధనాలు పురుగుమందులు వంటి అనేక రోజు వారి ఉత్పత్తుల్లో ఇవి కనిపిస్తాయి. గాలి ఆహారం నీరు చర్మం ద్వారా ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి
దీనివలన అభివృద్ధి వైకల్యాలు పునరుత్పత్తి సమస్యలు అకాల యుక్తవయసు సంతానలేమి సమస్యలు మరియు క్యాన్సర్ సంక్రమించవచ్చు . రోగనిరోధక నాడీ వ్యవస్థల మీద ఈ ఎండోక్రయం డిస్టర్ప్టర్స్ పనిచేస్తాయి .  దీనివలన ఊబకాయం హృదయం మనము రోజు వాడే ప్లాస్టిక్ కంటైనర్లు సౌందర్య సాధనాలు షాంపూ క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా ఎండక్రైన్ డిస్టప్టర్స్ ని కలిగి ఉంటాయి పిల్లలు ఆడుకునే బొమ్మలు వారు వేసుకునే బట్టలు, పెద్దవాళ్లు వాడేటటువంటి సింథటిక్ బట్టలు అంటే స్పోర్ట్స్ బ్రా లెగ్గింగ్స్ యోగ ప్యాంట్లు వ్యాయామ దుస్తులను ప్లాస్టిక్ కంటెంట్ ఉంటుందని
డాక్టర్. ఎ అరుణ కుమారి అన్నారు.మరి వీటిని పరిమితం చేయడం ఎలా?ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం తగ్గించాలి. బాటిల్ మీరు బదులుగా ఫిల్టర్ నీరు వాడాలి. ప్లాస్టిక్ కంటైనర్లలో మైక్రోవేవ్ చేయకూడదు . వేడి ప్రదేశాల్లో డబ్బాల్లో లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాన్ని నిల్వ చేయకూడదు ఎయిర్ ఫ్రెషనర్లు లేదా దుర్గంధ నాసిని వినియోగం తగ్గించాలి. సింథటిక్ ఫ్యాబ్రిక్ వినియోగం తగ్గించాలి లేదా ప్లాస్టిక్ లేని సహజమైన ఫ్యాబ్రిక్ ని ఎంచుకోవాలి .పాల ఉత్పత్తులను తగ్గించాలి గర్భిణీలు పాలిచ్చే తల్లులు చేపల్ని మితంగా తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ తినకూడదు. సేంద్రీయ పండ్లు, సేంద్రియ కూరగాయలు, సేంద్రియ మాంసం ,సేంద్రియ ఆహారం వినియోగం పెంచుకోవాలి.

బురదలో కూరుకుపోయిన పందిపాడు ఇందిరమ్మ కాలనీ
**అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం – మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించాలి**

పల్లె వెలుగు, కర్నూలు బ్యూరో**

కర్నూలు పట్టణ సమీపంలోని **పందిపాడు ఇందిరమ్మ కాలనీ** వాసులు మౌలిక వసతుల లేమితో బిక్కమొహాలు పట్టుకుంటున్నారు. వర్షాకాలం రాగానే మట్టిరోడ్లు బురదకూపాలుగా మారి, కాలనీవాసుల జీవనాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు వినతి చేసినా, సమస్యలు పరిష్కారమవ్వకపోవడం స్థానికులలో తీవ్ర అసంతృప్తి రేగిస్తోంది.

### బురద రోడ్లతో రాకపోకల ఇబ్బంది

కాలనీలో ప్రధాన సమస్య రోడ్లేనని ప్రజలు చెబుతున్నారు. మట్టిరోడ్లు ప్రతి వర్షం తర్వాత బురదకూపాలుగా మారిపోతుండడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు నడిచే వీలు లేకుండా పోతుంది. గ్యాస్ సిలిండర్లు, రేషన్ బియ్యం రవాణా కూడా అసాధ్యం కావడంతో, ప్రజలు మూడు కిలోమీటర్లు నడిచి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ బురద వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వెంటనే రోడ్లను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

### తాగునీటి కష్టాలు, మురుగు సమస్యలు

తాగునీటి సదుపాయం కూడా కాలనీలో లేదు. నీళ్ళ కోసం వాసులు ప్రతిరోజూ మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. డ్రైనేజీలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే నిలిచి ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

### అధికారుల నిర్లక్ష్యం – ప్రజల ఆవేదన

కాలనీ సమస్యలపై ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కమిషనర్‌కి వినతిపత్రాలు అందజేసినప్పటికీ, అధికారులు “చూద్దాం, చేస్తాం” అనే మాటలతో కాలం గడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు కూడా వినిపించని చెవుల్లా వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

### భద్రతపై ఆందోళన

కాలనీలో వీధికుక్కల బెడద ఎక్కువగా ఉందని, పిల్లలు ఇంటి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారని వాసులు చెబుతున్నారు. అంతేకాకుండా రాత్రివేళల్లో కొందరు యువకులు మద్యం తాగి కాలనీలో తిరుగుతుండటంతో మహిళలు భయంతో బయటకు రావడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం ప్రతి రెండు రోజులకు ఒకసారి పోలీస్ పర్యవేక్షణ ఉండాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

### ప్రజల విజ్ఞప్తి

బూరుగులో కూరుకుపోయిన పందిపాడు ఇందిరమ్మ కాలనీ సమస్యలను తక్షణం పరిష్కరించాలని ప్రజలు మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌లను వేడుకుంటున్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం వెంటనే నిధులు కేటాయించి, పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

స్పందించిన అధికారులు.
వేగవంతంగా రహదారి మరమ్మత్తులు.

శిరివెళ్ల :(నంది పత్రిక)

సిరివెళ్ల మండల పరిధిలోని యర్రగుంట్ల మేజర్ గ్రామ పంచాయతీలో ప్రధాన రహదారి కుంగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యల పట్ల అధికారులు స్పందించారు. తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టారు. ఉదయం ఎంపీడీవో సి శివమల్లేశ్వరప్ప అధికారులు ఈఓ అశ్విని కుమార్ ఆధ్వర్యంలో కుంగిన  పరిశీలించారు.వెంటనే తక్షణ చర్యలలో భాగంగా పనులు చేపట్టాలని ఆదేశించిన కారణంగా గురువారం ఈఓ అశ్విని కుమార్ సర్పంచ్ శుభాన్ వలి ఆధ్వర్యంలో కుంగిన రహదారి వద్ద జెసిబి సహాయంతో పనులు చేపట్టారు. రహదారిని గ్రావెల్ తో నింపి చదును చేశారు. ప్రజా సమస్యలను వెలికి తీసిన 48 గంటలలోపే పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈవో అశ్విని కుమార్ రహదారి మరమ్మత్తు పనులు దగ్గర ఉండి పూర్తిచేసి రాకపోకల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారి లోని కల్వర్టు వద్ద ముళ్ళకంప పోదలను సైతం తొలగించి గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని గ్రామస్తులు పేర్కొన్నారు.